రవ్వతో గారెలు.. నిమిషాల్లో!

వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అన్నారు. అవంత అమోఘం మరి. కానీ అవి ఉప్మాలా క్షణాల్లో చేయలేం. ముందు రాత్రి మినప్పప్పు నానబెట్టి, తెల్లారాక గ్రైండ్‌ చేస్తేనే కానీ పిండి సిద్ధం కాదు.

Updated : 10 Mar 2024 00:13 IST

వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అన్నారు. అవంత అమోఘం మరి. కానీ అవి ఉప్మాలా క్షణాల్లో చేయలేం. ముందు రాత్రి మినప్పప్పు నానబెట్టి, తెల్లారాక గ్రైండ్‌ చేస్తేనే కానీ పిండి సిద్ధం కాదు. మరి అప్పటికప్పుడు గారెలు తినాలనిపిస్తే? హోటల్‌ నుంచి తెప్పించుకోవాలంటారా! లేదులేదు.. ఇన్‌స్టంట్‌గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎలాగంటే.. రెండు కప్పుల ఉప్మారవ్వలో కప్పు పెరుగు, అర కప్పు ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, అల్లం పచ్చిమిర్చి ముద్ద ఒక్కో స్పూన్‌ చొప్పున, చారెడు కొత్తిమీర తరుగు, నాలుగు కరివేపాకు రెబ్బలు, కచ్చాపచ్చా దంచిన పుదీనా, తగినంత ఉప్పు వేసి.. కొన్ని నీళ్లతో గట్టిగా ఉండేలా పిండి తయారుచేసుకోవాలి. దాని మీద మూత పెట్టేసి.. పదినిమిషాలు పక్కనుంచాలి. తర్వాత పావు చెంచా బేకింగ్‌ సోడా వేసి.. మరోసారి కలపాలి. ఈ మిశ్రమంతో గారెలు చేసి కాగుతున్న నూనెలో వేయించుకుంటే సరిపోతుంది. గరం గరం గారెలు నిమిషాల్లో తయారైపోతాయి. ఇంటిల్లిపాదీ ఇష్టంగా తినేస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని