ఈ దొండకాయ అందరికీ నచ్చేస్తుంది!

దొండకాయ కూర చాలామందికి నచ్చదు. మా ఇంట్లోనూ అంతే. దాన్ని తినిపించాలంటే కొబ్బరి తురుము, అల్లం మిర్చి పేస్టు లాంటివి వేస్తుంటాను.

Published : 17 Mar 2024 00:21 IST

దొండకాయ కూర చాలామందికి నచ్చదు. మా ఇంట్లోనూ అంతే. దాన్ని తినిపించాలంటే కొబ్బరి తురుము, అల్లం మిర్చి పేస్టు లాంటివి వేస్తుంటాను. వంకాయ కూరలు ఉల్లికారంతో, మసాలా దినుసులతో.. రకరకాలుగా చేస్తాం కదా! దొండకాయలతో మాత్రం అలా ఎందుకు చేయకూడదు- అనిపించిందో రోజు. వెంటనే ప్రయత్నించా. బాగా కుదిరి, పిల్లలు ఇష్టంగా తిన్నారు. ఇదెంతో సులువు కూడా. ఎలా చేయాలంటే.. అర కిలో దొండకాయలకు ఒక చిప్ప ఎండు కొబ్బరి, పావు కప్పు పల్లీలు, చారెడు జీలకర్ర తీసుకుని.. నూనె లేకుండా వేయించాలి. కారం, ఉప్పు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు జతచేసి నూరాలి. దొండకాయలను నింపుడు వంకాయల్లా చివర్లో తెగకుండా చీల్చినట్లు కోసి.. మరీ మెత్తగా అవ్వకుండా కాస్త ఉడికించి తీయాలి. సిద్ధం చేసుకున్న మసాలాని కాయల మధ్యలో కూరాలి. కడాయిలో కొద్దిగా నూనె వేసి సన్న సెగ మీద వేయించి, కొత్తిమీర చల్లితే సరి.. ప్రత్యేకమైన రుచీ, సువాసనలతో అందరికీ నచ్చేస్తుంది.

తాండ్ర విజయలక్ష్మి, మహబూబ్‌ నగర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని