పొట్లంలో అన్నం తిందామా!

ఎప్పుడూ చేసుకునే వంటకాలు ఎంత బాగున్నా సరే.. మన నాలుక ఇంకేవో కొత్త రుచులు కోరుకుంటుంది.

Published : 24 Mar 2024 00:03 IST

ప్పుడూ చేసుకునే వంటకాలు ఎంత బాగున్నా సరే.. మన నాలుక ఇంకేవో కొత్త రుచులు కోరుకుంటుంది. అలాంటి క్రేవింగ్‌ని సంతృప్తి పరచాలనుకుంటే త్రిపురవాసుల ప్రసిద్ధ వంటకం ‘అవాన్‌ బంగుయీ’ ప్రయత్నించండి. దీనికి ఏమేం కావాలంటే కప్పు బియ్యం, ఒక చెంచా అల్లం తరుగు, కొద్దిగా కొత్తిమీర తరుగు, కిస్‌మిస్‌, జీడిపప్పులు చారెడు చొప్పున, రుచికి ఉప్పు, అర కప్పు ఉల్లిపాయ ముక్కలు, పావు కప్పు చొప్పున క్యారెట్‌, బీన్స్‌ ముక్కలు, 3 టేబుల్‌ స్పూన్ల నెయ్యి, అరిటాకులు అవసరమవుతాయి. ఎలా చేయాలంటే.. బియ్యాన్ని ఒక గంట నానబెట్టాలి. తర్వాత నీళ్లు వడకట్టేసి అందులో ఉప్పు, అల్లం, ఉల్లి, బీన్స్‌, క్యారెట్‌ ముక్కలు, కొత్తిమీర తరుగు, కిస్‌మిస్‌, జీడిపప్పులు, నెయ్యి వేసి కలపాలి. ఒక్కో అరిటాకును శంఖంలా (కోన్‌) చుట్టి.. అందులో సగం వరకూ బియ్యం మిశ్రమాన్ని వేయాలి. పైన కొంత ఖాళీభాగం ఉంచి.. పొట్లం కట్టినట్టు అంచులను మడిచేసి, దారంతో విడిపోకుండా కట్టేసి, ఉడికిస్తే సరి.. రుచికరమైన ‘అవాన్‌ బంగుయీ’ సిద్ధం. త్రిపుర వాళ్ల ఈ వంటకాన్ని మనమూ చేసి చూద్దామా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని