నోరూరించే క్యారెట్‌ బాదుషా

ఎక్కువమందికి బాదుషా తెలుసు, క్యారెట్‌ హల్వా తెలుసు. కానీ క్యారెట్లతో బాదుషా కొత్త కదూ! నోరూరించే ఈ స్వీట్‌ ఎలా చేయాలో చెబుతాను. చేసి చూడండి

Published : 31 Mar 2024 00:11 IST

ఎక్కువమందికి బాదుషా తెలుసు, క్యారెట్‌ హల్వా తెలుసు. కానీ క్యారెట్లతో తో బాదుషా కొత్త కదూ! నోరూరించే ఈ స్వీట్‌ ఎలా చేయాలో చెబుతాను. చేసి చూడండి. దీనికి క్యారెట్లు కిలో, మైదాపిండి 100 గ్రాములు, పంచదార 150 గ్రాములు, డాల్డా వేయించేందుకు సరిపడా, యాలకులు 6, పైనాపిల్‌ ఎసెన్స్‌ 3 చుక్కలు, మిఠాయి రంగు తీసుకోండి. క్యారెట్లతో ను ఉడికించి మెత్తగా రుబ్బి, మైదాపిండి, యాలకులపొడి, పైనాపిల్‌ ఎసెన్స్‌, మిఠాయి రంగు, రెండు చెంచాల డాల్డా వేసి పూరీల పిండిలా కలపాలి. నీళ్లు కలపాల్సిన అవసరం లేదు. పిండిని చిన్న చిన్న భాగాలు చేయాలి. ఒక్కో ఉండను.. చేతులతో మెదుపుతూ కొంచెం గుండ్రంగా, బాదుషాలా చేసి మధ్యలో కాస్త నొక్కినట్లు చేయాలి. పంచదారను తీగ పాకం పట్టాలి. డాల్డాలో వేయించిన క్యారెట్‌ బాదుషాలను పంచదార పాకంలో వేసి వెంటనే మరో పాత్రలోకి తీయాలి. ఇవి రుచిగానే కాదు,  ఆకర్షణీయంగానూ ఉంటాయి.

- పవన్‌ సిరిగిరి, చెఫ్‌, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు