అరిటాకుతో హల్వా అట!

ఇప్పటి దాకా అరిటాకులో అన్నం తినడమే తెలుసు కదూ! ఇప్పుడు ఆ ఆకును కూడా తినొచ్చని రుజువు చేస్తున్నారు. పైగా కూరో, పచ్చడో కాదు.. ఏకంగా హల్వా చేసేశారు.

Published : 07 Apr 2024 00:19 IST

ఇప్పటి దాకా అరిటాకులో అన్నం తినడమే తెలుసు కదూ! ఇప్పుడు ఆ ఆకును కూడా తినొచ్చని రుజువు చేస్తున్నారు. పైగా కూరో, పచ్చడో కాదు.. ఏకంగా హల్వా చేసేశారు. వివరంగా చెప్పాలంటే.. ఒక ఫుడ్‌ వ్లాగర్‌ అరిటాకులను కడిగి, మధ్యలో ఉన్న ఈనెను తీసేసి.. ఒక దాని మీద ఒకటి పేర్చాడు. వాటిని రోల్‌ చేసినట్లు చుట్టేసి, పేలికలుగా కట్‌ చేశాడు. వాటన్నిటినీ మిక్సీ జార్‌లో వేసి, కొన్ని నీళ్లతో గ్రైండ్‌చేసి, దాన్ని వడకట్టాడు. ప్యాన్‌లో నెయ్యి, అరిటాకుల చిక్కటి రసం, పంచదార, మొక్కజొన్న పిండి, డ్రైఫ్రూట్స్‌ వేసి ఉడికించాడు. అంతే.. ఆకుపచ్చ అద్భుతం.. అరిటాకు హల్వా తయారైపోయింది. ‘గ్రేట్‌ ఇండియన్‌ అస్మర్‌’ పేరుతో ఇన్‌స్టాలో పోస్టయిన ఈ వీడియోకి ఇప్పటిదాకా పన్నెండున్నర లక్షలకు పైగా లైక్స్‌ వచ్చాయి. ఫుడ్‌ లవర్స్‌ అంతా తెగ మెచ్చేసుకుంటున్నారు. ఈ హల్వా మనమూ చేద్దామా మరి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని