ఓట్స్‌ వడలు తింటారా..

మా అబ్బాయికి ఓట్స్‌తో చేసే మసాలా వడలు చాలా ఇష్టం. నేను చేస్తే మెత్తగా వచ్చాయి. కరకరలాడుతూ మరింత రుచిగా ఉండేందుకు కొన్ని చిట్కాలు చెప్పండి!

Published : 19 Nov 2023 00:44 IST

మా అబ్బాయికి ఓట్స్‌తో చేసే మసాలా వడలు చాలా ఇష్టం. నేను చేస్తే మెత్తగా వచ్చాయి. కరకరలాడుతూ మరింత రుచిగా ఉండేందుకు కొన్ని చిట్కాలు చెప్పండి!

  • మన తెలుగు వారి ఇళ్లల్లో తరచూ చేసే మసాలా వడల్లా ఉత్తరాదివాళ్లు ఓట్స్‌ మసాలా వడ చేస్తారు. ఇవి తక్కువ నూనె పీలుస్తాయి కనుక ఆరోగ్యానికి మంచిది.
  • శనగపప్పును ఎక్కువగా నానబెట్టకూడదు. రెండు గంటలు నానితే 80% నాని, మిగిలింది పలుకుగా ఉంటుంది. అలా ఉంటేనే వడలు కరకరలాడతాయి.
  • పప్పును బరకగా రుబ్బి.. అందులో ఓట్స్‌, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, కారం, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.
  • ఎక్కువ నీళ్లు పోయకుండా.. అవసరం మేరకు చెంచాతో కొద్ది కొద్దిగా పోస్తూ.. పిండిని గట్టిగా కలపాలి. వడలు సరిగా రాకుండా.. పొడిపొడిగా అయిపోతుంటే ఇంకొన్ని నీళ్లు పోయండి.
  • ముందు హైఫ్లేమ్‌ మీద నూనెను కాగనివ్వాలి. సలసలా కాగిన తర్వాత.. వడలు వేసి మంటను కాస్త తగ్గించి.. ఎర్రగా వేయించాలి. ఇలా చేస్తే బయట కరకరలాడుతూ.. లోపల చక్కగా ఉడికి.. ఎంతో రుచిగా ఉంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని