ఎండ నుంచి బార్లీ రక్ష!

వేసవిలో తినడం తక్కువ. దాహార్తితో ఎక్కువగా ద్రవ పదార్థాలనే తీసుకుంటాం. అలా తీసుకొనేటప్పుడు బార్లీ నీళ్లను తీసుకుంటే ఎండల నుంచి అన్నిరకాలుగా రక్షణ పొందవచ్చు... శరీరం పోషకాలు కోల్పోకుండా కాపాడి... వ్యాధినిరోధక శక్తిని పెంచే బార్లీ ఎండ నుంచి చర్మాన్ని కాపాడుతుంది.

Updated : 19 Mar 2023 00:55 IST

వేసవిలో తినడం తక్కువ. దాహార్తితో ఎక్కువగా ద్రవ పదార్థాలనే తీసుకుంటాం. అలా తీసుకొనేటప్పుడు బార్లీ నీళ్లను తీసుకుంటే ఎండల నుంచి అన్నిరకాలుగా రక్షణ పొందవచ్చు... శరీరం పోషకాలు కోల్పోకుండా కాపాడి... వ్యాధినిరోధక శక్తిని పెంచే బార్లీ ఎండ నుంచి చర్మాన్ని కాపాడుతుంది. దీనిలోని రసాయనాలు.. చర్మానికి మెరుపునిస్తాయి. మొటిమలు రాకుండా అడ్డుకుంటాయి. వయసు ఛాయలని వెనక్కి నెట్టే శక్తి బార్లీ గింజలకుంది. గర్భిణులకు మలబద్ధకం రాకుండా చేయడంలోనూ, పోషకాలు అందించడంలోనూ, ఉదయం పూట వచ్చే వికారాన్ని తొలగించడంలోనూ సహాయకారిగా ఉంటుంది. ఎండాకాలంలో తరచూ ఎదురయ్యే మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లని నుంచి బార్లీ నీళ్లు ఉపశమనం కలిగిస్తాయి. వీటిని జావగా కాచుకోవచ్చు. సూపుగానూ తయారు చేసుకోవచ్చు. బార్లీ పిండిని చపాతీ పిండిలో కలిపి వాడుకోవచ్చు. ఇలా ఏదో ఒక రూపంలో వీటిని తీసుకుంటే వేసవి సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. అలర్జీ సమస్యలతో బాధపడేవారు.. బార్లీని అతిగా తీసుకోకపోవడమే మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని