దగ్గా?... జలుబా?.. నీరసమా? తర్బూజా తినండి!

ఈ మధ్యకాలంలో మనల్ని తరచూ ఇబ్బంది పెడుతున్న సమస్యలు దగ్గు, జలుబు, జ్వరం. వీటి బారిన పడకుండా చేస్తుంది. ఊపిరితిత్తులని ఆరోగ్యంగా ఉంచుతుంది.

Updated : 26 Mar 2023 13:17 IST

ఈ మధ్యకాలంలో మనల్ని తరచూ ఇబ్బంది పెడుతున్న సమస్యలు దగ్గు, జలుబు, జ్వరం. వీటి బారిన పడకుండా చేస్తుంది. ఊపిరితిత్తులని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలో బి6, విటమిన్‌ సి, ఫొలేట్‌, పొటాషియం, ఇనుము అధికంగా ఉండే ఈ పండుకి వ్యాధినిరోధకశక్తిని పెంచే గుణం ఉంది.
వేసవి వస్తూనే అనేక రకాల పండ్ల రుచులనీ మోసుకొస్తుంది. అందులో తర్బూజా పండు కూడా ఒకటి. హానీడ్యూ మెలన్‌ అని పిలుచుకొనే ఈ పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి..  
కెలొరీలు తక్కువ.. పీచు ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకొనేవారికి మంచి ఆహారం.
చక్కని సువాసనతో నోరూరించే ఈ పండు వేసవిలో వచ్చే అనేక సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంతోపాటు అందమైన చర్మాన్నీ అందిస్తుంది. వయసుని తగ్గిస్తుంది. ఎందుకంటారా? దీనిలోని విటమిన్‌ సి కి చర్మాన్ని బిగుతుగా ఉంచే కొల్లాజెన్‌ని వృద్ధి చేస్తుంది. దాంతో చర్మం అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది.
నలభైల్లో అడుగుపెడుతున్న ప్పుడు చూపు మందగించే సమస్య ఉంటుంది. అటువంటివారికి ఇది మంచి ఆహారం. చూపుని మెరుగుపరుస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు