చిట్టి పనస ముచ్చట తెలుసా!

తియ్యటి రుచీ, సువాసనలతో మెప్పించే పనసపండుని ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి. అయితే, ఇప్పుడు చెప్పుకొనే పండు...అచ్చంగా దాన్నే పోలి ఉన్నప్పటికీ పరిమాణంలోనూ, రుచిలోనూ కూడా కాస్త భిన్నం.

Published : 09 Jul 2023 00:21 IST

తియ్యటి రుచీ, సువాసనలతో మెప్పించే పనసపండుని ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి. అయితే, ఇప్పుడు చెప్పుకొనే పండు...అచ్చంగా దాన్నే పోలి ఉన్నప్పటికీ పరిమాణంలోనూ, రుచిలోనూ కూడా కాస్త భిన్నం.  అరచేతిలో ఇమిడి పోయే వీటిని మలయాళీయులు అంజిలి చెక్క అని పిలుస్తుంటారు. వర్షపాతం ఎక్కువగా ఉండే కేరళ అటవీ ప్రాంతంలో ఎక్కువగా దొరుకుతాయివి. కొన్నాళ్లుగా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లోనూ ప్రత్యేక పంటగా సాగు చేస్తున్నారు. రుచిలో పనస, అనాస పండ్లను కలిపి తిన్నట్లే ఉంటాయి. తాజాగా తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్‌ హర్షసాయి ఈ పండ్లు అమ్మే వ్యక్తి గురించి ఓ షార్ట్‌ వీడియో పెట్టగా వారం రోజుల్లోనే ఐదు మిలియన్ల మందికి పైగానే దీన్ని చూశారు. ఈ అడవి పనస ఏంటా అని అంతర్జాలంలో శోధిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని