సులువైన శ్రీఖండ్‌

తీపి ఇష్టపడేవారికి నచ్చే మిఠాయి శ్రీఖండ్‌. ప్రత్యేక రుచితో అలరించే ఈ స్వీటును మహారాష్ట్రలో దేవుడికి నైవేద్యంగానూ పెడతారు. దీన్ని వండాల్సిన పనిలేదు, నూనె, నెయ్యిలతో అసలే ప్రమేయం లేదు.

Published : 16 Jul 2023 00:19 IST

పొరుగు వంట

తీపి ఇష్టపడేవారికి నచ్చే మిఠాయి శ్రీఖండ్‌. ప్రత్యేక రుచితో అలరించే ఈ స్వీటును మహారాష్ట్రలో దేవుడికి నైవేద్యంగానూ పెడతారు. దీన్ని వండాల్సిన పనిలేదు, నూనె, నెయ్యిలతో అసలే ప్రమేయం లేదు. ఈ స్వీటు చేయడం ఎంతో సులభం కూడా. పెరుగును పల్చటి వస్త్రంతో వడకట్టి నీళ్లన్నీ పోయేలా చేయాలి. అందులో తగినంత పంచదార, నేతితో వేయించిన బాదం, పిస్తా, జీడిపప్పు లాంటి డ్రై ఫ్రూట్స్‌ పలుకులు, కాస్తంత ఇలాచీ పొడి, కొద్దిగా కుంకుమ పువ్వు వేస్తే సరిపోతుంది. పెరుగును వడకట్టే శ్రమ కూడా వద్దనుకుంటే యోగర్ట్‌తో చేసుకోవచ్చు. నిమిషాల్లో తయారయ్యే ఈ స్వీటు.. రుచికి రుచి, బలానికి బలం. నచ్చితే మీరూ ప్రయత్నించండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని