ఈ బూరెలు.. చేయడం మహా తేలిక!

బియ్యప్పిండితో చేసే బూరెలు అందరికీ తెలుసు కానీ.. అటుకులతో చేసినవి ఎప్పుడూ తిని ఉండరు కదూ! మా అమ్మ అలా చేస్తుంటే.. నేను చూసి నేర్చుకున్నాను.

Published : 10 Dec 2023 00:10 IST

బియ్యప్పిండితో చేసే బూరెలు అందరికీ తెలుసు కానీ.. అటుకులతో చేసినవి ఎప్పుడూ తిని ఉండరు కదూ! మా అమ్మ అలా చేస్తుంటే.. నేను చూసి నేర్చుకున్నాను. మొదటిసారి ఇలా చేయొచ్చని చెబితే.. ‘అవేం బూరెలు?’ అన్నారు మా అత్తగారు నవ్వుతూ. తీరా చేశాక.. ‘భలే ఉన్నాయి’ అంటూ ఆవిడే చాలా మెచ్చుకున్నారు. ఎంతో సులువుగా చేసే ఈ బూరెలు మహా రుచిగా ఉంటాయి. కప్పు అటుకులకు అర కప్పు బెల్లం, చారెడు గోధుమ పిండి, పావు చెంచా యాలకుల పొడి, రెండు స్పూన్ల నెయ్యి, వేయించేందుకు నూనె అవసరమౌతాయి. ఎలా చేయాలంటే.. అటుకులను కచ్చాపచ్చా దంచాలి. బెల్లం కరిగించి.. అందులో అటుకులు, గోధుమ పిండి, యాలకుల పొడి, నెయ్యి వేయాలి. సన్న సెగ మీద ఉండలు కట్టకుండా కలియ తిప్పుతూ.. రెండు నిమిషాలయ్యాక దించేయాలి. ఈ మిశ్రమాన్ని చల్లారనిచ్చి.. చిన్న ఉండలుగా చేసి బూరెలుగా ఒత్తుకుని కాగిన నూనెలో బంగారు రంగు వచ్చేదాకా వేయించి తీయాలి. అంతే అటుకుల చిట్టి బూరెలు తయారైపోతాయి. మీరూ చేసి చూడండి.. తప్పకుండా నచ్చుతాయి.

చుండూరి సీత, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని