ధుస్కా..ఎవరికైనా నచ్చేస్తుంది!

ఇరుగు పొరుగు రాష్ట్రాల వంటలు కొన్ని సుపరిచితమైనా.. ఎక్కువ శాతం వంటలు మనకు కొత్తగా అనిపిస్తాయి. ‘ధుస్కా’ అలాంటిదే. ఇది ఝార్ఖండ్‌ వాసులకు ప్రియమైంది.

Published : 22 Oct 2023 00:21 IST

ఇరుగు పొరుగు రాష్ట్రాల వంటలు కొన్ని సుపరిచితమైనా.. ఎక్కువ శాతం వంటలు మనకు కొత్తగా అనిపిస్తాయి. ‘ధుస్కా’ అలాంటిదే. ఇది ఝార్ఖండ్‌ వాసులకు ప్రియమైంది. ఎలా చేస్తారంటే.. రెండు కప్పుల బాస్మతి బియ్యం, ఒక కప్పు శనగ పప్పులను నాలుగైదు గంటలు నానబెట్టాలి. నాలుగు పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి.. గ్రైండ్‌ చేయాలి. అందులో చారెడు కొత్తిమీర తరుగు, కాస్త పసుపు, తగినంత ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. పిండి మరీ గట్టిగా లేదా మరీ జారుగా ఉండకూడదు. చిన్న గరిటెలోకి పిండి తీసుకుని.. మెల్లగా నూనెలోకి వదలాలి. పునుగుల్లా బంగారు రంగు వచ్చేదాకా వేయిస్తే.. వహ్వా అనిపించే ధుస్కా సిద్ధం. ఇవి వేడి వేడిగా తింటే.. ఎంతో రుచిగా ఉంటాయి. ఆలూ టొమాటో లాంటి కూరతో లేదా ఏ పచ్చడితోనైనా తినొచ్చు. సులువైన ఈ వంటకం నచ్చితే.. మీరూ ప్రయత్నించండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని