ఇక పానీపూరీ ఎప్పుడంటే అప్పుడే..

పానీపూరీ మనందరికీ చాలా చాలా ఇష్టమైన స్ట్రీట్‌ ఫుడ్‌. రోజూ తిన్నా విసుగేయదు. మరి పానీపూరీ వీధుల్లోనే ఎందుకు తినాలి? దుమ్మూధూళీ లేకుండా ఇంట్లోనే తింటే బాగుంటుంది కదూ!

Published : 14 Apr 2024 00:14 IST

పానీపూరీ మనందరికీ చాలా చాలా ఇష్టమైన స్ట్రీట్‌ ఫుడ్‌. రోజూ తిన్నా విసుగేయదు. మరి పానీపూరీ వీధుల్లోనే ఎందుకు తినాలి? దుమ్మూధూళీ లేకుండా ఇంట్లోనే తింటే బాగుంటుంది కదూ! పూరీల ప్యాకెట్‌ కొనుక్కోవచ్చు కానీ.. పానీ ఎలా అనుకుంటున్నారా? అదేం కష్టం కాదు, తేలిగ్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎలాగంటారా.. రెండున్నర టేబుల్‌ స్పూన్ల ఎండిన పుదీనా ఆకుల పొడి, రెండు టేబుల్‌ స్పూన్ల వేయించిన జీలకర్ర, చెంచా చొప్పున మిరియాల పొడి, సైంధవ లవణం, ధనియాల పొడి, అర చెంచా చొప్పున శొంఠి పొడి, ఆమ్‌చూర్‌ పౌడర్‌, పంచదార, కాస్త ఇంగువ, చిటికెడు సిట్రిక్‌ యాసిడ్‌ క్రిస్టల్స్‌ను తీసుకోవాలి. చేయడం కూడా మహా సులభం.. వీటన్నిటినీ కలిపి గ్రైండ్‌ చేస్తే చాలు ఘుమఘుమలాడే ‘పానీపూరీ మసాలా’ తయారైపోతుంది. పొడి మాత్రం బరకగా లేకుండా చాలా మెత్తగా ఉండాలి. లేదంటే సరిగ్గా కలవదు. దీన్ని తడి లేని సీసాలో భద్రం చేసుకుంటే పానీపూరీ తినదలచినప్పుడు కప్పు నీళ్లల్లో అర చెంచా చొప్పున కలిపితే సరిపోతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని