ఉన్నియప్పమ్‌ చేద్దామా!

కేరళ వాసుల ఇష్టమైన వంటకం ఉన్నియప్పమ్‌. దీన్నెలా చేయాలంటే.. కప్పు బియ్యం కడిగి, నాలుగు గంటలు నానబెట్టాలి. ఆ నీళ్లు తీసేసి.. పావు చెంచా యాలకుల పొడి, రెండు అరటిపండ్ల ముక్కలు వేసి గ్రైండ్‌ చేయాలి.

Published : 17 Mar 2024 00:24 IST

కేరళ వాసుల ఇష్టమైన వంటకం ఉన్నియప్పమ్‌. దీన్నెలా చేయాలంటే.. కప్పు బియ్యం కడిగి, నాలుగు గంటలు నానబెట్టాలి. ఆ నీళ్లు తీసేసి.. పావు చెంచా యాలకుల పొడి, రెండు అరటిపండ్ల ముక్కలు వేసి గ్రైండ్‌ చేయాలి. ముప్పావు కప్పు బెల్లంపొడిలో రెండు చెంచాల నీళ్లు పోసి మరిగించి, వడపోయాలి. ఆ పాకాన్ని బియ్యప్పిండిలో కలపాలి. ప్యాన్‌లో టేబుల్‌ స్పూన్‌ నెయ్యి కాగనిచ్చి, చారెడు ఎండు కొబ్బరి ముక్కలు, చెంచా నల్ల నువ్వులు వేసి.. నిమిషం వేగనిచ్చి బియ్యప్పిండిలో కలపాలి. పావు చెంచా చొప్పున డ్రైజింజర్‌ పొడి, బేకింగ్‌ సోడా, చిటికెడు ఉప్పు వేసి, మళ్లీ కలపాలి. గుంట పొంగనాల పాత్రలో కాస్త నెయ్యి వేసి.. గరిటెతో తగినంత పిండి వేసి.. సన్న సెగ మీద వేగనివ్వాలి. నిమిషం తర్వాత తిరగేసి.. బంగారు రంగులోకి మారాక తీసేస్తే సరిపోతుంది. ఈ తియ్యటి పొంగనాలనే ఉన్నియప్పమ్‌ అంటారు. వీటిని పొరుగు రాష్ట్రాల వాళ్లు కూడా ఇష్టంగా తింటారు. మనమూ చేద్దామా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని