అతి పెద్ద మిఠాయి

దేశవిదేశాల్లో రకరకాల స్వీట్ల గురించి వింటుంటాం. అందుబాటులో ఉన్నవాటిని ఆరగించి ఆనందిస్తుంటాం. పంచదార, కోడిగుడ్లు, గెలాటిన్‌ అనే ప్రొటీన్‌లతో తయారయ్యే మెక్సికన్‌ మార్ష్‌మల్లౌ స్వీటును రుచి చూసిన వాళ్లంతా దాని గురించి గొప్పగా వర్ణిస్తుంటారు

Updated : 23 Jul 2023 02:05 IST

దేశవిదేశాల్లో రకరకాల స్వీట్ల గురించి వింటుంటాం. అందుబాటులో ఉన్నవాటిని ఆరగించి ఆనందిస్తుంటాం. పంచదార, కోడిగుడ్లు, గెలాటిన్‌ అనే ప్రొటీన్‌లతో తయారయ్యే మెక్సికన్‌ మార్ష్‌మల్లౌ స్వీటును రుచి చూసిన వాళ్లంతా దాని గురించి గొప్పగా వర్ణిస్తుంటారు. అది క్యాండీ తరహాలో నములుతున్న కొద్దీ బబుల్‌గమ్‌లా సాగుతూ తమాషా రుచితో వహ్వా అనిపిస్తుందట. ఇప్పుడు దీని ప్రస్తావన ఎందుకంటే ‘డల్సెస్‌ మజాపన్‌ డి లా రోసా’ అనే మిఠాయిల సంస్థ 648.4 కిలోల బరువైన అతి పెద్ద మార్ష్‌మల్లౌ స్వీటు తయారుచేసి గతంలో ఉన్న 480 కిలోల రికార్డును అధిగమించింది. మెక్సికోలోని జలిస్కో రాష్ట్ర 200 వార్షికోత్సవ వేడుకల సందర్భంగా 100 మంది పాకశాస్త్ర ప్రవీణులు 53 గంటల పాటు శ్రమించి దీన్ని తయారుచేశారు. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ న్యాయనిర్ణేత కార్లోస్‌ టాపియా రికార్డును ధృవీకరించిన తర్వాత మార్ష్‌మల్లౌ మిఠాయిని- ఆ వేడుక చూసేందుకు వచ్చిన వారందరికీ పంచిపెట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని