తియ్యటి రబ్రీ.. తిని చూడండి!

ఉత్తర ప్రదేశ్‌లో సంప్రదాయ వంటకం ‘రబ్రీ’. కొందరు ‘రబ్డీ’ అని కూడా అంటారు. చిక్కటి పాలు, పంచదారలతో చేసే ఈ మధురమైన స్వీటు ఎలా చేయాలంటే.. పొట్టు తీసిన బాదం పప్పులు, జీడిపప్పు, కిస్‌మిస్‌, పిస్తాలను నేతిలో వేయించి పక్కన ఉంచాలి.

Published : 17 Sep 2023 00:40 IST

త్తర ప్రదేశ్‌లో సంప్రదాయ వంటకం ‘రబ్రీ’. కొందరు ‘రబ్డీ’ అని కూడా అంటారు. చిక్కటి పాలు, పంచదారలతో చేసే ఈ మధురమైన స్వీటు ఎలా చేయాలంటే.. పొట్టు తీసిన బాదం పప్పులు, జీడిపప్పు, కిస్‌మిస్‌, పిస్తాలను నేతిలో వేయించి పక్కన ఉంచాలి. లీటరు చిక్కటి పాలు ఒకసారి పొంగు వచ్చాక సెగ తగ్గించి మరగనివ్వాలి. మధ్య మధ్యలో కలియబెడుతుండాలి. పాలు సగం అయ్యాక అర కప్పు పంచదార, కుంకుమ పువ్వు, ఇలాచీ పొడి వేయాలి. కుంకుమ పువ్వు వేశాక.. పాలు పసుపు రంగుకు మారతాయి. ఇంకొంచెం చిక్కబడ్డాక స్టవ్వు కట్టేసి వేయించిన డ్రైఫ్రూట్స్‌ వేయాలి. చల్లారాక కొంతసేపు ఫ్రిజ్‌లో ఉంచితే మరింత రుచిగా ఉంటుంది. చల్లచల్లటి, తియ్యతియ్యటి రబ్రీ నోరూరించేలా ఆకర్షణీయంగా ఉంటుంది. అమృతాన్ని ప్లేటులో వడ్డించినట్లే ఉంటుందంటే అతిశయం కాదు. ఇది చేయడం చాలా సులువు. ఇరుకైన పాత్ర కాకుండా కాస్త విశాలంగా ఉన్నది తీసుకుంటే.. పాలు త్వరగా చిక్కబడతాయి. అడుగంటకుండా అప్పుడప్పుడూ కలిపితే సరిపోతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని