అనర్సా అద్భుతః

ఝార్ఖండ్‌ రాష్ట్ర ప్రత్యేక మిఠాయి అనర్సా. ఇది చేయడానికి ఏమేం కావాలంటే.. బియ్యం కప్పున్నర, గోధుమపిండి అర కప్పు, బెల్లంపొడి కప్పు, పావు కప్పు పాలు, 3 చెంచాల వెన్న, చెంచా గసగసాలు, పావు కప్పు నువ్వులు, పావు చెంచా యాలకుల పొడి, వేయించడానికి సరిపడా నూనె అవసరమవుతాయి.

Updated : 10 Mar 2024 12:56 IST

ఝార్ఖండ్‌ రాష్ట్ర ప్రత్యేక మిఠాయి అనర్సా. ఇది చేయడానికి ఏమేం కావాలంటే.. బియ్యం కప్పున్నర, గోధుమపిండి అర కప్పు, బెల్లంపొడి కప్పు, పావు కప్పు పాలు, 3 చెంచాల వెన్న, చెంచా గసగసాలు, పావు కప్పు నువ్వులు, పావు చెంచా యాలకుల పొడి, వేయించడానికి సరిపడా నూనె అవసరమవుతాయి. తయారీ చాలా సులువే.. నువ్వులు, గసగసాలను కలిపి ఒక పళ్లెంలో పోయాలి. బియ్యం ముందు రోజు రాత్రి నానబెట్టి, ఉదయం ఆ నీళ్లు తీసేసి.. గ్రైండ్‌ చేయాలి. ఆ బియ్యప్పిండిని ఒక పాత్రలోకి తీసుకుని.. గోధుమపిండి, నెయ్యి, యాలకుల పొడి, బెల్లంపొడి, పాలు, వెన్న జతచేసి బాగా కలపాలి. ఈ పిండిని నిమ్మకాయంత భాగాలుగా తీసుకుని, అరచేతులతో బూరెల్లా చేసి.. నువ్వులు, గసగసాల్లో ముంచి తీసి.. కాగుతున్న నూనెలో వేయించాలి. బంగారు రంగులోకి మారగానే టిష్యూ పేపర్‌ మీదికి తీస్తే సరి.. ఘుమఘుమలాడే అనర్సా రెడీ. ఈ తియ్యటి స్వీటు ఎంతో శక్తి కూడా.


సాల్ట్‌ బిస్కెట్లకు చాలా రంధ్రాలు ఉంటాయి కదా! ఇవి ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు విషయమేమంటే.. అలా చిల్లులు ఉంటే బిస్కెట్లను బేక్‌ చేసేటప్పుడు పగుళ్లు రావు. ముఖ్యంగా గాలి బుడగలు ఏర్పడవు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని