కలర్‌ఫుల్‌ క్యారెట్‌ రవ్వ లడ్డు

సాధారణ రవ్వలడ్డు, డ్రై ఫ్రూట్స్‌ లడ్డు చాలాసార్లే చేస్తుంటాం. ఈ రెంటినీ కలిపి చేస్తే.. అందులో క్యారెట్‌ కూడా జతచేస్తే.. భలే ఉంటుంది కదా అనిపించింది. ఎప్పుడూ పాతవే కాకుండా.. కొంచెం ప్రయోగాలు చేస్తే ఇంట్లో అంతా ఇష్టంగా తింటారు. అందుకే ఇలా ప్రయత్నించాను.

Updated : 24 Sep 2023 03:51 IST

సాధారణ రవ్వలడ్డు, డ్రై ఫ్రూట్స్‌ లడ్డు చాలాసార్లే చేస్తుంటాం. ఈ రెంటినీ కలిపి చేస్తే.. అందులో క్యారెట్‌ కూడా జతచేస్తే.. భలే ఉంటుంది కదా అనిపించింది. ఎప్పుడూ పాతవే కాకుండా.. కొంచెం ప్రయోగాలు చేస్తే ఇంట్లో అంతా ఇష్టంగా తింటారు. అందుకే ఇలా ప్రయత్నించాను. ఇంతకీ దీన్నెలా చేయాలంటే.. ముందుగా అర కప్పు జీడిపప్పు, ఇంకో అర కప్పు బాదం పప్పులను నేతిలో వేయించి పొడి చేయాలి. కడాయిలో తగినంత నెయ్యి వేసి ఒక కప్పు రవ్వను వేయించి, అందులో కప్పు క్యారెట్‌ తురుము వేసి వేయించాలి. పచ్చి వాసన పోయాక.. అర కప్పు కొబ్బరి, ఒకటిన్నర కప్పు పంచదార, అర చెంచా యాలకుల పొడి, గ్రైండ్‌ చేసిన జీడిపప్పు, బాదం పొడి, పిస్తా, కిస్‌మిస్‌లు వేయాలి. బాగా కలిపి, పావు కప్పు కాచి చల్లార్చిన పాలు పోయాలి. మధ్య మధ్యలో కలియ తిప్పుతూ సన్న సెగ మీద ఉడికించాలి. ఈ మిశ్రమం కొంచెం వెచ్చగా ఉండగానే నిమ్మకాయంత పరిమాణంలో ఉండలు చుట్టుకోవాలి. అంతే.. పావు గంటలో డ్రై ఫ్రూట్స్‌ క్యారెట్‌ రవ్వ లడ్డు సిద్ధం. ఇది బలమూ, రుచే కాదు.. పిల్లలకు ఆకర్షణీయంగానూ కనిపిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు