నాతో పెళ్లి.. తనతో ప్రేమేంటి?
మనలో మనం
నేనొక అబ్బాయిని ప్రేమించా. కష్టపడి ఇంట్లోవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకున్నా. మాకో పాప. మేం ఊరెళ్లినప్పుడు కరోనా లాక్‌డౌన్ వచ్చి అక్కడే ఆగిపోయాం. కొన్నాళ్లయ్యాక ఒకరోజు మా పక్కింటివాళ్లు ఫోన్ చేసి ‘మీ ఆయన మీ ఇంటి ముందున్న అమ్మాయితో సన్నిహితంగా ఉంటున్నారు’ అని చెప్పారు. మొదట్లో నమ్మలేదు. తిరిగొచ్చిన తర్వాత అది నిజమేనని తెలిసింది. చాలా బాధ పడ్డా. మా ఆయనను, తనని నిలదీస్తే ‘మేం ఫ్రెండ్లీగా ఉంటాం. ఏవో చిన్నచిన్న అవసరాలకు మాట్లాడుకుంటున్నాం. ఇకనుంచి మానేస్తాం’ అన్నారు. తర్వాత మళ్లీ కలుసుకోసాగారు. ఓసారి మా ఆయన ఫోన్ చెక్ చేస్తే.. ఇంకా చాలామంది అమ్మాయిలతో చాటింగ్ చేస్తున్నట్టు కనిపించింది. అప్పట్నుంచి నా మనసు విరిగిపోయింది. మా ఆయన మీద ప్రేమ, నమ్మకం పోయింది. పాప కోసం కలిసి ఉండాల్సి వస్తోంది తప్ప.. మా మధ్య ఏ అనుబంధం లేదు. ఏం చేయాలి?
- టి.ఎస్., ఈమెయిల్
మీ విషయంలో జరిగింది బాధాకరమే. సాన్నిహిత్యం, నిబద్ధత, నమ్మకం ఉంటేనే ఆడ, మగ మధ్య ప్రేమ దృఢమవుతుంది అంటాడు ప్రఖ్యాత సైకాలజిస్ట్ రాబర్ట్ స్టీన్‌బర్గ్. అంతకుముందు మీ అనుబంధంలో ఈ మూడూ ఉండేవి గనకే ప్రేమ పెళ్లి చేసుకున్నారు. తర్వాత అవి ఎందుకు లోపించాయి? తను వేరే అమ్మాయికి ఎందుకు దగ్గర కావాల్సి వచ్చిందో ఆలోచించారా? ఇది జరిగాక అయినా తనని అడగాల్సింది.
ఏదేమైనా తను మరొకరితో సన్నిహితంగా ఉండటం సమర్థనీయం కాదు. విషయం తెలిశాక, ఇలాంటివి వద్దు అని చెప్పిన తర్వాత కూడా అతను మళ్లీ అలా చేయడం ముమ్మాటికీ తప్పే. పాప కోసం ఆ నమ్మక ద్రోహం, బాధ భరించడం నిజంగా అభినందనీయం. కానీ ఎన్నాళ్లిలా? మీది చిన్న వయసే. బోలెడంత భవిష్యత్తు ఉంది. మీరిద్దరూ ఎడమొహం, పెడమొహంగా ఉంటే అది పాప భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుంది. తనకి మరో అవకాశం ఇచ్చి చూడండి. ఇలాంటివి పునరావృతం అయితే బాగుండదని గట్టిగా చెప్పండి. బహుశా తను మారొచ్చు. ప్రేమించి, పెద్దల్ని ఒప్పించి పెళ్లాడిన అమ్మాయి మనసు నొప్పిస్తున్నాననే విషయం తెలిసి ఆయనలో మార్పు రావొచ్చు. ఇప్పటికీ తను మీ పాపని, మిమ్మల్ని ప్రేమిస్తుంటే తను తప్పకుండా మారతాడు. గతంలోనూ అమ్మాయిల ఆకర్షణకు లోనైన వ్యక్తి అయితే ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. అన్నింటికీ ముందు తనని కూర్చోబెట్టి అసలు తన మనసులో ఏముంది? ఎందుకు అలా చేశారు? అని ఒపిగ్గా అడగండి. మీరెంత బాధ పడుతున్నారో వివరించండి. తను సవ్యంగా లేకపోవడం వల్ల కలుగుతున్న పర్యవసానాలు వివరించండి. అవసరమైతే పెద్దలతో చెప్పించండి. ప్రస్తుతం మీరు ఉంటున్న ఇంటిని మార్చి వేరేచోటికి వెళ్తే.. మీరు చేదు జ్ఞాపకాల్లోంచి కొంత బయటపడే అవకాశం ఉంటుంది. ఈ ప్రయత్నాలు చేస్తే తప్పకుండా ఫలితం సానుకూలంగా ఉంటుంది.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Jadcherla: జడ్చర్ల కాంగ్రెస్‌లో రచ్చ.. మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌పై అనిరుధ్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు
-
Movies News
Karan Johar: కత్రినా పెళ్లి.. ఆలియా నేనూ మందు తాగి విక్కీకి ఫోన్ చేశాం: కరణ్ జోహార్
-
Politics News
భాజపా కుట్రలో పావులౌతున్నారు.. శశిధర్ రెడ్డి వ్యాఖ్యలపై అద్దంకి దయాకర్
-
General News
Top ten news 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 న్యూస్
-
India News
YouTube Channels: నకిలీ వార్తల వ్యాప్తి.. 8 యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం వేటు
-
World News
Monkeypox: మంకీపాక్స్ టీకాలు 100 శాతం పనిచేయవు..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Vinod kambli: బీసీసీఐ పింఛనే నాకు దిక్కు.. సచిన్ నుంచి ఏమీ ఆశించట్లేదు: వినోద్ కాంబ్లి
- Liger: లైగర్ ఓటీటీ ఆఫర్ ఎందుకు వదులుకున్నారు?
- DK : ఆయన ఓటమిని అస్సలు తట్టుకోలేడు.. సహనం తక్కువే.. కానీ!
- అజిత్ డోభాల్ ఇంటి వద్ద వ్యక్తి హల్చల్ ఘటన.. ముగ్గురు కమాండోలపై వేటు
- Vizag: విశాఖలో రౌడీషీటర్ హత్య.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఘాతుకం
- Andhra News: వివాహితను భయపెట్టి నగ్న వీడియో కాల్..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (18/08/2022)
- Viral video: యూనిఫాంలో పోలీసుల ‘నాగిని డ్యాన్స్’.. వైరల్‌గా మారిన వీడియో
- డేంజర్ జోన్లో రాష్ట్ర ప్రభుత్వం
- Kabul: కాబుల్ మసీదులో భారీ పేలుడు.. భారీగా ప్రాణనష్టం?