చాటింగూ వద్దంటే ఎలా?
మనలో మనం
చిన్నప్పుడే నాన్న చనిపోయారు. మేనత్తే నన్ను చదివించారు. ఇప్పుడు నేను మంచి పొజిషన్‌లో ఉన్నా. గతంలోనే మా బావని పెళ్లి చేసుకొమ్మని అడిగిందామె. కృతజ్ఞతాభావంతో సరేనన్నా. తనదీ మంచి ఉద్యోగమే. సమస్య ఏంటంటే.. నేను వేరే ఏ అబ్బాయితో మాట్లాడొద్దంటాడు. ఎవరితోనూ చాటింగ్ చేయొద్దంటాడు. ఎక్కడికెళ్లినా చెప్పే వెళ్లాలట. తన పద్ధతి నచ్చడం లేదు. ఆ మాట చెబితే సాయం చేసిన వాళ్లని దూరం చేసుకున్నదాన్ని అవుతానని భయమేస్తోంది. ఏం చేయాలి?
ఎస్.స్వాతి, ఈమెయిల్
మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన మీ మేనత్తది నిజంగా పెద్ద మనసే. మీరు కృతజ్ఞతా భావం చూపించాలనుకోవడమూ అభినందనీయం. మీ సమస్య విషయానికొస్తే.. మీరు ఆమె ఇంటి కోడలు కావాలని ఆశించడంలో తప్పేం లేదు. అయితే పెళ్లి అంటే జీవితం అనే విషయం గుర్తుంచుకోవాలి. భాగస్వామితో అభిప్రాయాలు కలిస్తేనే, ఒకర్నొకరు ఇష్టపడితేనే పెళ్లి చేసుకోవాలి. మీపై ఉన్న చనువు, ప్రేమతో మీ అత్తయ్య మన మనిషి మన ఇంట్లో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు. ఆమె రుణం తీర్చుకోవడానికి మీ జీవితాన్ని పణంగా పెట్టడం భావ్యం కాదు కదా. అయినా వాళ్ల రుణం కేవలం పెళ్లితో తీరిపోయేది కాదు.
ఇప్పుడు మీ బావ విషయానికొద్దాం. మీరు ఇతర అబ్బాయిలతో మాట్లాడొద్దు, చాటింగ్ చేయొద్దు అంటున్నాడు. బయటికి వెళ్లేటప్పుడూ చెప్పే వెళ్లాలి అంటున్నాడు. మీపై ప్రేమతో, మీరు ఇబ్బందుల్లో పడొద్దని, జాగ్రత్తగా ఉండాలని తను అలా చెబుతుంటే ఇందులో తప్పు పట్టడానికేం లేదు. అలా కాకుండా అనుమానంతో అలా చేస్తుంటే.. అతడితో జీవితాంతం వేగడం కష్టం. మీరు మంచి స్థాయిలో ఉన్నారంటున్నారు. ఉద్యోగరీత్యా ఆడా, మగా తేడా లేకుండా అందరితో మాట్లాడాల్సి ఉంటుంది. దాన్ని కూడా వేరే కోణంలో ఆలోచించే మనస్తత్వం తనది అయితే జీవితంలో ఎదగలేరు. వ్యక్తిగతంగానూ ఇద్దరి మధ్యా మనస్పర్థలు వస్తాయి. ఆజ్ఞాపించే, అనుమానించే మనస్తత్వం అయితే ఈ సంబంధం వదులుకోవడమే మంచిది. తల్లిలా, కంటికి రెప్పలా పెంచిన మీ మేనత్త మిమ్మల్ని తప్పకుండా అర్థం చేసుకుంటారు. వేరే అబ్బాయిని పెళ్లాడినా ఆమెకి తోడుంటాను, బంధం వదులుకోను.. అని భరోసా కల్పించాల్సిన బాధ్యత మీపైనే ఉంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
NTR: ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 నాణెం.. త్వరలో మార్కెట్లోకి
-
World News
Nowruz: గూగుల్ డూడుల్ ‘నౌరుజ్ 2023’ గురించి తెలుసా?
-
General News
Amaravati: అమరావతిలో మళ్లీ అలజడి.. ఆర్ 5జోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ
-
Sports News
MIW vs RCBW: ముంబయి ఇండియన్స్ చేతిలో ఆర్సీబీ చిత్తు..
-
India News
Amritpal Singh: ‘ఆపరేషన్ అమృత్పాల్’కు పక్షం రోజులు ముందే నిశ్శబ్దంగా ఏర్పాట్లు..!
-
Movies News
RRR: ‘ఆస్కార్’కు అందుకే వెళ్లలేదు.. ఆ ఖర్చు గురించి తెలియదు: ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత