AP High Court: తెదేపా నేత అయ్యన్న ఇంటి గోడ నిర్మాణానికి హైకోర్టు అనుమతి

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. డ్రైనేజీ భూమిని ఆక్రమంచి ఇంటి గోడ నిర్మించారని పేర్కొంటూ మున్సిపల్‌ అధికారులు ఆయన ఇంటి గోడను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఇంటి గోడ కూల్చివేత ప్రక్రియను నిలువరించాలని కోరుతూ అయ్యన్నపాత్రుడ...

Published : 22 Jun 2022 18:39 IST

అమరావతి: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. డ్రైనేజీ భూమిని ఆక్రమంచి ఇంటి గోడ నిర్మించారని పేర్కొంటూ మున్సిపల్‌ అధికారులు ఆయన ఇంటి గోడను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఇంటి గోడ కూల్చివేత ప్రక్రియను నిలువరించాలని కోరుతూ అయ్యన్నపాత్రుడి కుమారులు విజయ్‌, రాజేష్‌ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వీవీ సతీష్‌ వాదనలు వినిపిస్తూ.. ఆమోదం పొందిన ప్లాన్‌ ప్రకారం నిర్మాణం చేశారన్నారు. తహసీల్దార్‌, జలవనరులశాఖ అధికారులు పరిశీలించి హద్దులు నిర్ణయించాకే నిర్మించారన్నారు. రాజకీయ కక్షతో.. నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేతలు ప్రారంభించారని చెప్పారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఇంటి గోడ నిర్మించుకునేందుకు పిటిషనర్లకు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణ వాయిదా పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని