Andhra News: మత్స్యకారుల అభివృద్ధే ధ్యేయంగా జనసేన పనిచేస్తుంది: నాదెండ్ల మనోహర్‌

ఎన్నికల ముందు మత్స్యకారులకు ఇచ్చిన హామీలను సీఎం జగన్‌ ఎందుకు అమలు చేయలేకపోతున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌..

Published : 13 Feb 2022 16:54 IST

కాకినాడ: ఎన్నికల ముందు మత్స్యకారులకు ఇచ్చిన హామీలను సీఎం జగన్‌ ఎందుకు అమలు చేయలేకపోతున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రశ్నించారు. కాకినాడలో జనసేన మత్స్యకార విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ‘మత్స్యకార అభ్యున్నతి యాత్ర’ను ఆయన ప్రారంభించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మత్స్యకారుల అభివృద్ధి, అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తుందని చెప్పారు. మత్స్యకారుల స్థితిగతులు, వారి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం దిశగా మత్స్యకార విభాగం కార్యక్రమాలు చేపడుతుందన్నారు. 

సముద్రంలో వేటకు వెళ్లి దురదృష్టవశాత్తు మృతిచెందిన వ్యక్తి కుటుంబానికి రూ.10లక్షలు అందజేస్తామని ఎన్నికలకు ముందు జగన్‌ హామీ ఇచ్చారని నాదెండ్ల మనోహర్‌ గుర్తు చేశారు. అధికారంలో వచ్చి రెండున్నరేళ్లు దాటినా నేటి వరకు కేవలం 64 కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం మాత్రమే అందించారన్నారు. మత్స్యకారుల అభివృద్ధికి జనసేన చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి భారీగా జనసైనికులు తరలివచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని