Ap news: ఏపీలో కొత్తగా 13వేల కరోనా కేసులు.. అదొక్కటే కాస్త ఊరట!

ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ కేసుల సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది. గత కొద్దిరోజులుగా రోజూ 10వేలకు పైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.

Published : 26 Jan 2022 17:31 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ కేసుల సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది. గత కొద్దిరోజులుగా రోజూ 10వేలకు పైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే, అదే సమయంలో కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఊరటనిస్తోంది. గడిచిన 24 గంటల్లో 46,143 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 13,618 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో పోరాడుతూ తాజాగా తూర్పుగోదావరి, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ఇద్దరేసి మృతి చెందగా, చిత్తూరు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరిలలో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు.

కరోనా బారి నుంచి నిన్న 8,687 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 106318 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అత్యధికంగా విశాఖపట్నంలో 1791 కేసులు నమోదు కాగా, అనంతపురంలో 1650, గుంటూరు 1464, కర్నూలు 1409, ప్రకాశం 1295, నెల్లూరు 1409 కేసులు నమోదయ్యాయి. కరోనాతో పోరాడుతూ ఇప్పటివరకూ 14,570 మంది మృతి చెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని