బడ్జెట్‌పై ప్రభుత్వం వివరణ ఇవ్వాలి: పవన్‌ కల్యాణ్‌

రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోకుండా... ప్రజలను ఆకర్షించడానికి మాత్రమే వైకాపా ప్రభుత్వం బడ్జెట్‌ రూపొందించినట్లుగా ఉందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. ఈ బడ్జెట్‌ అంతా ఓ పెద్ద కనికట్టు అని పవన్‌

Updated : 17 Jun 2020 05:20 IST

అమరావతి: రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోకుండా... ప్రజలను ఆకర్షించడానికి మాత్రమే వైకాపా ప్రభుత్వం బడ్జెట్‌ రూపొందించినట్లుగా ఉందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. ఈ బడ్జెట్‌ అంతా ఓ పెద్ద కనికట్టు అని పవన్‌ అన్నారు. ‘‘వ్యవసాయం, ఇరిగేషన్, గృహనిర్మాణాల, వైద్య ఆరోగ్యం లాంటి కీలక శాఖల బడ్జెట్‌లో కోతలు విధించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలి’’ అని పవన్‌ డిమాండ్‌ చేశారు.

‘‘రాష్ట్రానికి ఆదాయ మార్గాలను పెంచకుండా ఎంతోకాలం సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించలేరు. గత ఆర్థిక సంవత్సరం (2019-20) బడ్జెట్‌ను రూ.2.27లక్షల కోట్ల అంచనాలతో రూపొందించారు. కానీ సవరించిన అంచనాలతో ఖర్చు చేసినది రూ.1.74 లక్షల కోట్ల మాత్రమే. వాస్తవ బడ్జెట్ అంచనాలకు సవరణలకు తేడా రూ.53,217.54 కోట్లుగా ఉంది’’ అని పవన్‌ వివరించారు. 

కొత్త బడ్జెట్ చూసిన తరువాత జనసేన నేతలు, పార్టీకి సేవలు అందిస్తున్న మేధావులు కొన్ని సందేహాలను వ్యక్తం చేశారని పవన్‌ చెప్పారు. ఆ వివరాలు ఈ ట్వీట్‌లో...

 

 

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని