అసమానతలు పెంచేలా జాతీయ విద్యా విధానం

విద్య, వైద్యం.. ఇలా అన్ని రంగాలనూ మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి ఆరోపించారు. మంగళవారం విజయనగరంలో

Published : 01 Dec 2021 04:12 IST

-  ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభల్లో కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జి

విజయనగరం అర్బన్‌, విద్యావిభాగం, న్యూస్‌టుడే: విద్య, వైద్యం.. ఇలా అన్ని రంగాలనూ మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి ఆరోపించారు. మంగళవారం విజయనగరంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర 23వ మహాసభల ముగింపు కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు. అణగారిన వర్గాలకు విద్యను దూరం చేసేందుకే నూతన జాతీయ విద్యావిధానం తీసుకొచ్చిందని.. ఇది అసమానతలు పెంచేలా ఉందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలతో పేదలు హక్కులు కోల్పోయి, దోపిడీకి గురవుతున్నారన్నారు.  భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాతే దేశంలో చట్టాలన్నీ కార్పొరేట్లకు చుట్టాలు అయ్యాయన్నారు.

విద్యార్థుల మహాప్రదర్శన

ఎస్‌ఎఫ్‌ఐ 23వ రాష్ట్ర మహాసభలు విజయనగరంలో మంగళవారం ముగిశాయి. చివరిరోజున విద్యార్థులు విజయనగరంలో మహాప్రదర్శన నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు వి.పి.సానూ, మయూక్‌ బిశ్వాస్‌, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె.ప్రసన్నకుమార్‌, ఎ.అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని