జగమంత కుటుంబం మాది!

పండగ అంటేనే పల్లెల్లో కొండంత సందడి కనిపిస్తుంది. ఇక సంక్రాంతి అంటే చేప్పేదేముంది.. ప్రతి ఇల్లూ బంధువులతో కళకళలాడుతుంది. ఈ సందర్భంగా చిన్నాపెద్దా కలిసి ఒకే సారి భోజనాలు చేయడం ఓ మధురానుభూతి.

Published : 17 Jan 2022 03:50 IST

పండగ అంటేనే పల్లెల్లో కొండంత సందడి కనిపిస్తుంది. ఇక సంక్రాంతి అంటే చేప్పేదేముంది.. ప్రతి ఇల్లూ బంధువులతో కళకళలాడుతుంది. ఈ సందర్భంగా చిన్నాపెద్దా కలిసి ఒకే సారి భోజనాలు చేయడం ఓ మధురానుభూతి. పండగ రోజు తన ఇంటికి పిలిపించుకున్న బంధువులందరికీ ఈ అనుభూతిని మిగల్చాలని తూర్పుగోదావరి జిల్లా చెముడులంక (గాంధీనగరం)కు చెందిన ప్రత్తి సత్యనారాయణ చక్కటి ప్రయత్నం చేశారు. కొడుకులు, కోడళ్లు, కుమార్తెలు, వారి పిల్లలు, బంధువులు మొత్తం 30 మందిని ఒకే చోట కూర్చోబెట్టి అందరికీ ఒకే సారి అరిటాకుల్లో భోజనం పెట్టారు. ఇన్నాళ్లు ఉద్యోగాల నిమిత్తం వివిధ ప్రాంతాల్లో ఉన్న వారంతా ఇలా సహపంక్తి భోజనాల్లో కూర్చొని ఎంతో మురిసిపోయారు.

- న్యూస్‌టుడే, ఆలమూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని