ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న జగన్‌

రాష్ట్రంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధ్వజమెత్తారు. గుంటూరులోని చుట్టుగుంట....

Published : 30 Nov 2021 05:10 IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధ్వజం

నగరంపాలెం(గుంటూరు) న్యూస్‌టుడే: రాష్ట్రంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధ్వజమెత్తారు. గుంటూరులోని చుట్టుగుంట పోలేరమ్మ తల్లి దేవాలయంలో.. దేశంలో కరోనా నియంత్రణ జరగాలని ఆకాంక్షిస్తూ భాజపా ఆధ్వర్యంలో సోమవారం లక్ష్మీనరసింహ స్వామి హోమం నిర్వహించారు. సోము వీర్రాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు అందించలేని దుస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. 2024లో ఏపీలో భాజపా అధికారంలోకి వస్తుందన్నారు.

వివిధ కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థల నిధులను ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌లోకి బదలాయించేలా ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం నియంతృత్వమేనని సోము వీర్రాజు మండిపడ్డారు. నిధులన్నింటినీ ఒకే గొడుకు కిందకు తెచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు ప్రయత్నిస్తోందని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని