యూపీఏ కూటమా! అదెక్కడుంది?: మమత

విపక్షాలను సంఘటితం చేయడంలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ వైఫల్యం చెందుతోందని ఇటీవల తరచూ విమర్శలు గుప్పిస్తున్న పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ముంబయిలో కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌

Updated : 02 Dec 2021 04:55 IST

ముంబయిలో శరద్‌ పవార్‌తో మమతా బెనర్జీ

ముంబయి: విపక్షాలను సంఘటితం చేయడంలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ వైఫల్యం చెందుతోందని ఇటీవల తరచూ విమర్శలు గుప్పిస్తున్న పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ముంబయిలో కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఐక్యప్రగతిశీల కూటమి (యూపీఏ) అస్తిత్వాన్నే ఆమె ప్రశ్నించారు. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమైతేనే 2024 సాధారణ ఎన్నికల్లో భాజపాను సులభంగా ఓడించొచ్చని అన్నారు. ఎన్సీపీ, శివసేన నేతలను కలుసుకునేందుకు 3 రోజుల ముంబయి పర్యటనకు వచ్చిన మమత బుధవారం.. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ను కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ‘‘యూపీఏ అంటూ ఏమీ లేదు’’ అని వ్యాఖ్యానించారు. పవార్‌ కూడా ‘‘ప్రస్తుత తరుణంలో నాయకత్వం సమస్య కాదు. భాజపాకు వ్యతిరేకంగా కలిసి పనిచేయడం కీలకం’’ అని తెలిపారు. మరో ప్రశ్నకు మమత బదులిస్తూ.. ‘‘రాజకీయాల్లో నిరంతర ప్రయత్నం తప్పనిసరి. ఎక్కువ సమయం విదేశాల్లో ఉండకూడదు’’ అని రాహుల్‌ పేరు ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు. అంతకుముందు పలువురు సామాజిక కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు.  


మేం లేకుండా భాజపాను ఓడించలేరు: కాంగ్రెస్‌

దేశంలో యూపీఏ లేదంటూ మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ మండిపడింది. తమ పార్టీ సహకారం లేకుండా భాజపాను ఓడించగలమని కలలు కనడాన్ని మానుకోవాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి    కె.సి.వేణుగోపాల్‌ హితవు పలికారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని