22 లక్షల ఐటీ కొలువులు ఇస్తాం: ఎస్పీ

ప్రజలు తమకు అధికారమిస్తే... ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూను ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దుతామని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ అంటున్నారు. అంతేకాదు..

Updated : 23 Jan 2022 05:32 IST

కల్హర్‌ నుంచి బరిలో అఖిలేశ్‌

లఖ్‌నవూ: ప్రజలు తమకు అధికారమిస్తే... ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూను ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దుతామని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ అంటున్నారు. అంతేకాదు.. ఐటీ రంగంలో 22 లక్షల కొలువులు యువతకు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. ‘‘గతంలో మేం అధికారంలో ఉన్నప్పుడు ఐటీ రంగంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్లాలని చాలా ప్రయత్నాలు చేశాం. మళ్లీ అధికారంలోకి వస్తే.. 22 లక్షల కొలువులు ఈ రంగంలో యువతకు అందిస్తాం’’ అని శనివారం విలేకరుల సమావేశంలో అఖిలేశ్‌యాదవ్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా మెయిన్‌పురి జిల్లాలోని కర్హల్‌ సీటు నుంచి అఖిలేశ్‌ పోటీ చేస్తారని ఎస్పీ ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని