ప్రభుత్వాలకు ఆర్థిక క్రమశిక్షణ ముఖ్యం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు బ్యాంకులు, ప్రజలకు ఆర్థిక క్రమశిక్షణ ముఖ్యమని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు డా.జయప్రకాశ్‌ నారాయణ(జేపీ) వ్యాఖ్యానించారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం పరిధిలో రాష్ట్రాలు 3.5 శాతం మించి రుణాలు

Published : 27 May 2022 05:25 IST

లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు బ్యాంకులు, ప్రజలకు ఆర్థిక క్రమశిక్షణ ముఖ్యమని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు డా.జయప్రకాశ్‌ నారాయణ(జేపీ) వ్యాఖ్యానించారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం పరిధిలో రాష్ట్రాలు 3.5 శాతం మించి రుణాలు తెస్తే అప్పుల ఊబిలో కూరుకుపోయి, ఆర్థికంగా దివాలా తీసే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. ఒకప్పుడు సంపన్న రాష్ట్రమైన పంజాబ్‌ ప్రస్తుతం ఆర్థికంగా కుదేలైందన్నారు. రాజస్థాన్‌, పశ్చిబెంగాల్‌తో పాటు తెలుగు రాష్ట్రాలూ అదే బాటలో ఉన్నాయన్నారు. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య కళానిలయంలో.. ఇండియన్‌ బ్యాంక్‌ రిటైరీస్‌ అసోసియేషన్‌(ఏపీ, తెలంగాణ) 12వ సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన జయప్రకాశ్‌ నారాయణ మాట్లాడుతూ.. మొండి బకాయిలను రాబట్టి బ్యాంకింగ్‌ రంగాన్ని బలోపేతం చేయాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని