ఆసుపత్రిలో ఆకలి కేకలు

తూర్పుగోదావరిజిల్లా అమలాపురం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో రోజూ మధ్యాహ్నం రోగులకు అందించే భోజనాన్ని బుధవారం నుంచి నిలిపివేశారు. కొన్నేళ్లుగా రోజూ 50-70 మంది రోగులకు ఇక్కడ భోజనం పెట్టేవారు.

Published : 02 Dec 2021 04:22 IST

అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రిలో మధ్యాహ్న భోజనానికి ఎదురుచూస్తున్న రోగులు

తూర్పుగోదావరిజిల్లా అమలాపురం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో రోజూ మధ్యాహ్నం రోగులకు అందించే భోజనాన్ని బుధవారం నుంచి నిలిపివేశారు. కొన్నేళ్లుగా రోజూ 50-70 మంది రోగులకు ఇక్కడ భోజనం పెట్టేవారు. 19 నెలలుగా గుత్తేదారుకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఈ సదుపాయాన్ని నిలిపివేశారు.దీంతో బాలింతలు, ఇతర రోగులు ఆకలితో అలమటించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా నిధుల విడుదలలో జాప్యంతో గుత్తేదారు భోజనాలు అందించలేదన్నారు.

- న్యూస్‌టుడే, అమలాపురం గ్రామీణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని