‘వాణిజ్య’ వంట గ్యాస్‌ ధర పైపైకి..

వాణిజ్య అవసరాలకు వినియోగించే వంటగ్యాస్‌ ధర పెరిగింది. ఒక్కో సిలిండర్‌(19కిలోలు)పై రూ.100 చొప్పున పెంచుతున్నట్లు ఇంధన సంస్థలు ప్రకటించాయి. దీంతో విజయవాడలో సిలిండర్‌ ధర రూ.2,219 అయింది.

Published : 02 Dec 2021 04:22 IST

తాజాగా సిలిండర్‌పై రూ.100 పెంపు

ఈనాడు, అమరావతి: వాణిజ్య అవసరాలకు వినియోగించే వంటగ్యాస్‌ ధర పెరిగింది. ఒక్కో సిలిండర్‌(19కిలోలు)పై రూ.100 చొప్పున పెంచుతున్నట్లు ఇంధన సంస్థలు ప్రకటించాయి. దీంతో విజయవాడలో సిలిండర్‌ ధర రూ.2,219 అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలో రూ.2,272, అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంతంలో రూ.2,262కు చేరుకుంది.

గత నెల్లో రూ.266.. : వాణిజ్య సిలిండర్ల ధరను గత నెలలోనే రూ.266 చొప్పున పెంచారు. ఇప్పుడు మరో రూ.100 చొప్పున బాదేశారు. మార్చి నుంచి పరిశీలిస్తే.. సిలిండర్‌పై రూ.500 వరకు చిరువ్యాపారులు, హోటల్‌ యజమానులపై భారం పడింది. నెలకు ఐదు సిలిండర్లు వినియోగిస్తే.. రూ.2,500 అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. కరోనాతో వ్యాపారాలు సరిగా లేవని, అద్దెలు కూడా చెల్లించలేకపోతున్నామని రోడ్ల పక్క తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకునే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని