AP Assembly: 21న మూడు రాజధానుల బిల్లు?

ప్రస్తుత శాసనసభ సమావేశాల్లోనే మూడు రాజధానులపై చర్చించి... బిల్లును ప్రవేశ పెడతామని సీఎం జగన్‌ తెలిపారంటూ సోషల్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గుర్నాథం వెల్లడించారు. బాపట్ల ఎంపీ

Updated : 18 Mar 2022 09:12 IST

తుళ్లూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రస్తుత శాసనసభ సమావేశాల్లోనే మూడు రాజధానులపై చర్చించి... బిల్లును ప్రవేశ పెడతామని సీఎం జగన్‌ తెలిపారంటూ సోషల్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గుర్నాథం వెల్లడించారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌, 3 రాజధానుల శిబిర నిర్వాహకులు, బహుజన పరిరక్షణ సమితి ఉద్యమ నాయకులు గుర్నాథం, బేతపూడి సాంబయ్య, ఆదాం తదితరులు గురువారం వెలగపూడిలోని సచివాలయంవద్ద ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా శాసనసభలో మూడు రాజధానుల బిల్లును మరోసారి ప్రవేశపెట్టాలని కోరుతూ ఆయనకు వినతిపత్రం అందించారు. అనంతరం గుర్నాథం మాట్లాడుతూ.. ఈనెల 21న శాసనసభలో 3 రాజధానులపై చర్చించి, బిల్లు ప్రవేశ పెడతామని సీఎం చెప్పినట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని