Tirumala: నేటి నుంచి శ్రీవారి మెట్టుమార్గంలో భక్తులకు అనుమతి

తిరుమలకొండకు నడిచి వెళ్లేందుకు అనుగుణంగా శ్రీవారిమెట్టు మార్గంలో గురువారం నుంచి భక్తులను అనుమతించనున్నారు. ఉదయం 8.30 గంటలకు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి ప్రత్యేకపూజలు

Updated : 05 May 2022 08:43 IST

ఈనాడు, తిరుపతి, న్యూస్‌టుడే, చంద్రగిరి: తిరుమలకొండకు నడిచి వెళ్లేందుకు అనుగుణంగా శ్రీవారిమెట్టు మార్గంలో గురువారం నుంచి భక్తులను అనుమతించనున్నారు. ఉదయం 8.30 గంటలకు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి ప్రత్యేకపూజలు నిర్వహించిన అనంతరం భక్తులు ఆ మార్గంలో నడిచివెళ్లేందుకు అవకాశం కల్పిస్తారు. గతేడాది నవంబరులో కురిసిన భారీ వర్షాలకు వరదలు రావడంతో మెట్టుమార్గం అక్కడక్కడ ధ్వంసమైంది. పునరుద్ధరణ పనులకు తితిదే రూ.3.60 కోట్లు మంజూరు చేసింది. 5 నెలలుగా కార్మికులు శ్రమించి పనులు పూర్తి చేశారు. 800, 1,200వ మెట్ల వద్ద వంతెనలు కూలిపోవడంతో అక్కడ నిర్మాణ పనులు పటిష్ఠంగా చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని