Union Budget 2022: దేశవ్యాప్తంగా ఏకరూప రిజిస్ట్రేషన్‌ విధానం

పౌరుల ఆస్తుల క్రయ విక్రయ దస్తావేజుల రిజిస్ట్రేషన్‌కు దేశవ్యాప్తంగా ఏకరూప విధానాన్ని ఒక ఆప్షన్‌గా అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ‘ఒకే దేశం...ఒకే రిజిస్ట్రేషన్‌ సాఫ్ట్‌వేర్‌’తో జాతీయ సార్వజనిక పత్ర రిజిస్ట్రేషన్‌

Updated : 02 Feb 2022 07:33 IST

భూములకు విశిష్ట గుర్తింపు సంఖ్య

పౌరుల ఆస్తుల క్రయ విక్రయ దస్తావేజుల రిజిస్ట్రేషన్‌కు దేశవ్యాప్తంగా ఏకరూప విధానాన్ని ఒక ఆప్షన్‌గా అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ‘ఒకే దేశం...ఒకే రిజిస్ట్రేషన్‌ సాఫ్ట్‌వేర్‌’తో జాతీయ సార్వజనిక పత్ర రిజిస్ట్రేషన్‌ వ్యవస్థ(ఎన్‌జీడీఆర్‌ఎస్‌)ను అనుసంధానించడానికి రాష్ట్రాలను ప్రోత్సహించనుంది. దీనిలో భాగంగానే భూముల రికార్డుల నిర్వహణను సమాచార సాంకేతికత(ఐటీ) ఆధారంగా చేపట్టే వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురానుంది. భూములకు, స్థలాలకు విశిష్ట గుర్తింపు సంఖ్యను జారీ చేయనున్నారు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూలులో పేర్కొన్న 22 భారతీయ భాషల్లోకి భూమి రికార్డులను తర్జుమా చేసే సదుపాయాన్ని తీసుకొస్తామని బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ తెలిపారు. ఈ చర్యలన్నీ దేశవ్యాప్తంగా ఏకరూప రిజిస్ట్రేషన్‌ విధానం అందుబాటులోకి తెచ్చేందుకు దోహదపడనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని