Andhra News: ఒక్కో ఎమ్మెల్యేకి రూ.2 కోట్లు.. తమకూ కేటాయించాలంటున్న..!

నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించే పథకం మళ్లీ మొదలుకానుంది. ప్రతి ఎమ్మెల్యేకు  రూ.2 కోట్ల చొప్పున.. 175 నియోజకవర్గాలకు ప్రస్తుత బడ్జెట్లో రూ.350 కోట్లు కేటాయించారు. అధికార, ప్రతిపక్ష

Published : 12 Mar 2022 08:30 IST

ఈనాడు, అమరావతి: నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించే పథకం మళ్లీ మొదలుకానుంది. ప్రతి ఎమ్మెల్యేకు  రూ.2 కోట్ల చొప్పున.. 175 నియోజకవర్గాలకు ప్రస్తుత బడ్జెట్లో రూ.350 కోట్లు కేటాయించారు. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలందరికీ వీటిని కేటాయిస్తామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తన ప్రసంగంలో చెప్పారు.  నియోజకవర్గాల అభివృద్ధికి ఎమ్మెల్యేలకు నిధుల  కేటాయింపు పథకం ఎప్పటి నుంచో ఉంది.

మరి ఎమ్మెల్సీల సంగతి?: నియోజకవర్గాలకు వెళ్లినప్పుడు ప్రజల నుంచి వినతులు వస్తున్నాయని, వాటి పరిష్కారానికి తమకూ ఈ నిధులను కేటాయించాలని ఎమ్మెల్సీలు కోరుతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఇస్తున్న నేపథ్యంలో.. తమపైనా ఒత్తిడి మరింత పెరుగుతుందని పేర్కొంటున్నారు. రాష్ట్రంలో 58 మంది శాసనమండలి సభ్యులున్నారు. వీరికీ రూ.2 కోట్ల చొప్పున ఇవ్వాలంటే రూ.116 కోట్లు కేటాయించాలి. అయితే ప్రస్తుత బడ్జెట్లో వీరికి సంబంధించిన ప్రస్తావన లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని