ఆరోగ్య సమస్యలపై వైద్య నిపుణుల సూచనలు

ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న అనేకానేక ఆరోగ్య సమస్యలకు జీవనశైలే కారణమవుతోంది. దీన్ని సరిచేసుకుంటే వాటిని తేలికగా నియంత్రించుకోవచ్చు. ఆ మాటకొస్తే మంచి జీవనశైలిని

Updated : 01 Apr 2022 17:10 IST

‘ఈనాడు సుఖీభవ’ వెబినార్‌కు ఆహ్వానం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న అనేకానేక ఆరోగ్య సమస్యలకు జీవనశైలే కారణమవుతోంది. దీన్ని సరిచేసుకుంటే వాటిని తేలికగా నియంత్రించుకోవచ్చు. ఆ మాటకొస్తే మంచి జీవనశైలిని పాటిస్తే జబ్బులను నివారించుకోవచ్చు కూడా. అందుకే ప్రపంచ ఆరోగ్య దినాన్ని పురస్కరించుకొని ‘ఈనాడు సుఖీభవ’ ఏప్రిల్‌ 3న ప్రత్యేక వెబినార్‌ నిర్వహిస్తోంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు ప్రముఖ వైద్య నిపుణులు జీవనశైలితో ముడిపడిన సమస్యలపై అవగాహన కల్పిస్తారు. ఇందులో మధుమేహ పరిశోధకులు డాక్టర్‌ పి.వి.రావు డయాబెటిస్‌ గురించి వివరిస్తారు. గుండెజబ్బులు, అధిక రక్తపోటుపై కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ రమేశ్‌ గూడపాటి..వ్యాయామం, ఫిట్‌నెస్‌ ప్రాధాన్యంపై ఫిజియోథెరపిస్ట్‌ డాక్టర్‌ ఎస్‌.రాజేశ్‌కుమార్‌.. ఆహారం, ఆరోగ్య సంబంధంపై న్యూట్రిషన్‌ ప్రొఫెసర్‌ (రిటైర్డ్‌) డాక్టర్‌ సి.అంజలీదేవి.. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవటంపై సైకియాట్రిస్ట్‌ డాక్టర్‌ శ్రీలక్ష్మి పింగళి తమ అమూల్యమైన సూచనలిస్తారు.

వెబినార్‌లో మీరూ పాల్గొనాలని అనుకుంటున్నారా? అయితే మీ పేరు, ఫోన్‌ నంబరు, మెయిల్‌ ఐడీలను 80085 52811 ఫోన్‌ నంబరుకు పంపి నమోదు చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని