75శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి

పాఠశాలల డ్రాపవుట్స్‌ తగ్గించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం అమ్మఒడి అమలు చేస్తోందని, 75శాతం హాజరు ఉంటేనే పథకం వర్తిస్తుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పాఠశాలల నిర్వహణకే రూ.2

Published : 24 Jun 2022 04:18 IST

విద్యాశాఖ మంత్రి బొత్స వెల్లడి

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: పాఠశాలల డ్రాపవుట్స్‌ తగ్గించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం అమ్మఒడి అమలు చేస్తోందని, 75శాతం హాజరు ఉంటేనే పథకం వర్తిస్తుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పాఠశాలల నిర్వహణకే రూ.2 వేల కోత విధిస్తున్నామన్నారు. గురువారం విజయనగరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్థికపరమైన సమస్యలుంటే అండగా ఉంటామని, తల్లిదండ్రులు వారి పిల్లలను పాఠశాలలకు పంపించాలని సూచించారు. నాడు-నేడులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా అభివృద్ధి చేశామన్నారు. ఉపాధ్యాయుల సామర్థ్యాలనూ మెరుగుపర్చుతున్నామని తెలిపారు. ఇంటర్మీడియట్‌లో ఫలితాల శాతం తగ్గలేదని, 2019కంటే ఎక్కువే వచ్చాయని చెప్పారు. అధ్యాపకుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని