అల్లూరి వీరగాథకు ఇక దేశవ్యాప్త గుర్తింపు: చిరంజీవి

భీమవరం నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణ ద్వారా ఆయన వీరత్వం, చరిత్ర దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ తెలుస్తాయని సినీనటుడు చిరంజీవి అన్నారు. అద్భుతమైన ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవటాన్ని

Published : 05 Jul 2022 04:39 IST

భీమవరం నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణ ద్వారా ఆయన వీరత్వం, చరిత్ర దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ తెలుస్తాయని సినీనటుడు చిరంజీవి అన్నారు. అద్భుతమైన ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవటాన్ని తన అదృష్టంగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. భీమవరం సభలో సోమవారం ఆయన ప్రసంగించారు. ముఖ్యఅతిథులు రాక ముందే వేదికపైకి చేరుకున్న చిరంజీవిని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆహ్వానించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించాలని కోరారు. ఆయన ప్రసంగం ప్రారంభించిన కొన్ని క్షణాల్లోనే గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వేదికపైకి చేరుకున్నారు. చిరంజీవిని చూసిన జగన్‌ ఆయన్ను ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత చిరంజీవి ప్రసంగాన్ని కొనసాగిస్తుండగానే.. ప్రధాని నరేంద్ర మోదీ వేదికపైకి చేరుకున్నారు. దీంతో ఆయన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని