ఎర్రపండు.. నేలపాలు

ఇది టమాటా పోసిన కళ్లం కాదు.. అనంతపురం గ్రామీణంలోని కక్కలపల్లి మార్కెట్‌. గిట్టుబాటు ధర రాలేదని రైతులే పారబోసిన టమాటా ఇది. వర్షాలు పడుతుండటంతో చెట్టుపైన కాయ ఉంచితే

Published : 08 Aug 2022 05:16 IST

ఇది టమాటా పోసిన కళ్లం కాదు.. అనంతపురం గ్రామీణంలోని కక్కలపల్లి మార్కెట్‌. గిట్టుబాటు ధర రాలేదని రైతులే పారబోసిన టమాటా ఇది. వర్షాలు పడుతుండటంతో చెట్టుపైన కాయ ఉంచితే దెబ్బతింటుందని రైతులు అన్నీ తెంపేసి మార్కెట్‌కు తెస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ మార్కెట్‌కు 4 నుంచి 5లక్షల బాక్సుల(ఒక్క బాక్సు 15కిలోలు) సరకు వస్తోంది. దీంతో మూడు రోజులుగా ‘నో సేల్‌’ బోర్డు పెట్టేశారు. అయినా.. ఆదివారం 93వేల బాక్సులు వచ్చాయి. వ్యాపారులు స్వల్ప మొత్తంలో బాక్సుకు రూ.150-200 వెచ్చించారు. మిగతాదంతా నాణ్యత లేదని వదిలేశారు. దిక్కుతోచని రైతులు సరకంతా మార్కెట్‌ ఆవరణలోనే పారబోసి వెళ్లిపోయారు.

- న్యూస్‌టుడే, జిల్లా వ్యవసాయం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని