ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ 20 నుంచి

రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు గురువులను నామినేట్‌ చేయాలని జిల్లా విద్యాధికారులకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్‌, ఎస్జీటీ కేటగిరీల్లో దరఖాస్తులు పంపించాలని

Published : 17 Aug 2022 03:49 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు గురువులను నామినేట్‌ చేయాలని జిల్లా విద్యాధికారులకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్‌, ఎస్జీటీ కేటగిరీల్లో దరఖాస్తులు పంపించాలని సూచించింది. ఉమ్మడి 13 జిల్లాలకు సంబంధించి జిల్లాకో పదవీ విరమణ చేసిన టీచర్‌ను సిఫార్సు చేయాలని వెల్లడించింది. ‘నాడు-నేడు’, గత రెండేళ్లలో ప్రవేశాల పెంపు, మరుగుదొడ్లు, పాఠశాల నిర్వహణ యాప్‌లు, మధ్యాహ్న భోజనం హాజరు నమోదు, సకాలంలో అమ్మఒడి డేటా పరిశీలన పూర్తి, జగనన్న విద్యా కానుక పంపిణీ, కొవిడ్‌ సమయంలో బోధనకు తీసుకున్న ప్రత్యేక చర్యలను అవార్డుకు ప్రామాణికంగా తీసుకోవాలని సూచించింది. జిల్లా స్థాయిలో సంయుక్త కలెక్టర్‌(అభివృద్ధి) ఛైర్మన్‌గా జిల్లా విద్యాధికారి కన్వీనర్‌గా.. డైట్‌ ప్రిన్సిపల్‌, ఎన్జీఓ ప్రతినిధి, ఒక జిల్లా అధికారి సభ్యులుగా ఎంపిక కమిటీ ఉంటుంది. జిల్లా స్థాయిలో వ్యక్తిగత దరఖాస్తులను ఈనెల 20-24, పరిశీలన 26, కమిషనరేట్‌కు తుది జాబితా సమర్పణ 28లోపు పంపించాల్సి ఉంటుంది. సెప్టెంబరు 5న రాష్ట్రస్థాయి కార్యక్రమం నిర్వహిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని