కేజీబీవీల్లో ఒప్పంద ఉపాధ్యాయులకు ఊరట

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేస్తున్న ఒప్పంద ఉపాధ్యాయులకు హైకోర్టులో ఊరట లభించింది. వారికి కనీస వేతన స్కేలును అమలు చేయాలని, 2022లో సవరించిన పే స్కేలు ప్రకారం పిటిషనర్లకు ఆరు వారాల్లో బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Published : 02 Oct 2022 04:35 IST

ఈనాడు, అమరావతి: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేస్తున్న ఒప్పంద ఉపాధ్యాయులకు హైకోర్టులో ఊరట లభించింది. వారికి కనీస వేతన స్కేలును అమలు చేయాలని, 2022లో సవరించిన పే స్కేలు ప్రకారం పిటిషనర్లకు ఆరు వారాల్లో బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘ఒకే విధమైన విధులు నిర్వర్తిస్తున్న వారికి వేర్వేరుగా జీతభత్యాలు అందించడం సరికాదు. అలా చేయడమంటే బానిసత్వాన్ని, దోపిడీని ప్రోత్సహించడమే’నని వ్యాఖ్యానించింది. తమకు కనీస వేతనం అమలుచేసేలా ఆదేశాలివ్వాలని, బదిలీలను నిలువరించాలని కోరుతూ కేజీబీవీల్లోని రెసిడెన్షియల్‌ ఒప్పంద ఉపాధ్యాయులు పలువురు హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని