Rain Alert: రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం స్థిరంగా కొనసాగుతున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.

Updated : 21 Nov 2022 07:07 IST

ఈనాడు, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం స్థిరంగా కొనసాగుతున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతానికి చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 670 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. ఈ కారణంగా రాష్ట్రంలో వాతావరణం చల్లబడింది. ఇది వాయుగుండంగా కొనసాగుతూ రాగల 48 గంటల్లో తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాలవైపు కదలనుంది. సోమ, మంగళవారాల్లో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, రాయలసీమలోని చిత్తూరు, వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, చాలాచోట్ల తేలికపాటి వర్షాలు ఉండొచ్చు. మత్స్యకారులు మంగళవారం వరకు దక్షిణ కోస్తా-తమిళనాడు తీరం వెంట వేటకు వెళ్లకూడదని రాష్ట్ర విపత్తుల సంస్థ ఎండీ అంబేడ్కర్‌ హెచ్చరించారు  రైతులు అప్రమత్తంగా ఉండాలని అత్యవసర సాయం, సమాచారం కోసం 1070, 1800 4250101, 08632377118 నంబర్లలో సంప్రదించాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని