పరిశోధనాత్మక అధ్యయనం అవసరం

‘మన రాజ్యాంగం చాలా గొప్పది. జూనియర్‌ న్యాయవాదులు రాజ్యాంగ నిబంధనలు, సీఆర్‌పీసీ, సీపీసీలను క్షుణ్నంగా చదవాలి. వృత్తిలో రాణించాలంటే పరిశోధనాత్మక అధ్యయనం అవసరం’ అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు పేర్కొన్నారు.

Updated : 27 Nov 2022 05:52 IST

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దుర్గాప్రసాదరావు

ఈనాడు, అమరావతి: ‘మన రాజ్యాంగం చాలా గొప్పది. జూనియర్‌ న్యాయవాదులు రాజ్యాంగ నిబంధనలు, సీఆర్‌పీసీ, సీపీసీలను క్షుణ్నంగా చదవాలి. వృత్తిలో రాణించాలంటే పరిశోధనాత్మక అధ్యయనం అవసరం’ అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శనివారం హైకోర్టు ప్రాంగణంలో న్యాయవాదుల సంఘం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాజ్యాంగం గొప్పతనాన్ని తెలుసుకొని, దానికి లోబడి పని చేయాలని సూచించారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌.అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం జస్టిస్‌ దుర్గాప్రసాదరావును న్యాయవాదుల సంఘం ప్రతినిధులు సన్మానించారు. కార్యక్రమంలో నిర్వాహకులు హైకోర్టు న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడు పీఎన్‌ మూర్తి, ప్రధాన కార్యదర్శి కె.నర్సిరెడ్డి, సంయుక్త కార్యదర్శి దూదేకుల ఖాసింసాహెబ్‌ పాల్గొనగా.. అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని