వృద్ధురాలి గూడు కూల్చివేత

విశాఖ దక్షిణ నియోజకవర్గం 31వ వార్డు లలితానగర్‌లో రోడ్డు పక్కన 35 ఏళ్లుగా నివసిస్తున్న వృద్ధురాలు అప్పియమ్మ (65) రేకుల షెడ్డును జీవీఎంసీ అధికారులు నిర్దాక్షిణ్యంగా తొలగించారు.

Updated : 27 Nov 2022 06:09 IST

విశాఖపట్నం (జ్ఞానాపురం), న్యూస్‌టుడే: విశాఖ దక్షిణ నియోజకవర్గం 31వ వార్డు లలితానగర్‌లో రోడ్డు పక్కన 35 ఏళ్లుగా నివసిస్తున్న వృద్ధురాలు అప్పియమ్మ (65) రేకుల షెడ్డును జీవీఎంసీ అధికారులు నిర్దాక్షిణ్యంగా తొలగించారు. భర్తలేని ఆమె ఇస్త్రీ చేస్తూ వచ్చే ఆదాయంతో అందులోనే నివసిస్తున్నారు. శనివారం ఉదయం హఠాత్తుగా జీవీఎంసీ సిబ్బంది వచ్చి ప్రభుత్వ స్థలంలో ఉందంటూ రేకుల షెడ్డును తొలగించారు. స్థానిక యువకులు, మహిళలు అడ్డుకున్నా వినలేదు. వృద్ధురాలికి న్యాయం చేయాలని వారు ఆందోళన చేశారు. డబ్బులివ్వలేదని వార్డు వైకాపా కార్పొరేటర్‌ బిపిన్‌ కుమార్‌ జైన్‌ ఇలా చేశారని బాధితురాలు ఆరోపించారు. ఇస్త్రీ కోసం స్థానికులు ఇచ్చిన దుస్తులనూ సిబ్బంది తీసుకెళ్లారని, తనకు న్యాయం చేయాలని కోరారు. రహదారిని 18 అడుగులు ఆక్రమించి అప్పియమ్మ రేకులషెడ్డు ఏర్పాటు చేశారని, తాను ఉంటున్న పరిసరాలనూ శుభ్రం చేయడం లేదంటూ స్థానికులు జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారని కార్పొరేటర్‌ వివరించారు. అందుకే అధికారులు రేకుల షెడ్డు తొలగించారని, తనపై ఆరోపణలు అసత్యమని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని