సినీ వాయిద్య కళాకారుడు చినబాబు మృతి

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలంలోని విశ్వనాథరావుపేటకు చెందిన ప్రముఖ సినీ వాయిద్య కళాకారుడు (తబలిస్టు) లంకా చినబాబు(55) ఆదివారం మృతి చెందారు.

Published : 28 Nov 2022 03:25 IST

విశ్వనాథరావుపేట (బిట్రగుంట), న్యూస్‌టుడే: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలంలోని విశ్వనాథరావుపేటకు చెందిన ప్రముఖ సినీ వాయిద్య కళాకారుడు (తబలిస్టు) లంకా చినబాబు(55) ఆదివారం మృతి చెందారు. చర్చిలో పాటలకు తబలా వాయిస్తుండగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి కన్నుమూశారు. సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, జేసుదాసు, రామకృష్ణ, మనో, పి.సుశీల, ఎస్‌.జానకి పాడిన పలు పాటలకు సంగీతం అందించిన బృందంలో తబలిస్టుగా చినబాబు పనిచేశారు.  సోమవారం స్వగ్రామంలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని