ఎన్టీఆర్‌ విగ్రహం మాయం

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం శివాపురం గ్రామంలో ఈ నెల 6న ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహం మాయం స్థానికంగా సంచలనంగా మారింది.

Updated : 09 Dec 2022 07:01 IST

ఏలూరు జిల్లా శివాపురంలో ఘటన

చింతలపూడి, న్యూస్‌టుడే: ఏలూరు జిల్లా చింతలపూడి మండలం శివాపురం గ్రామంలో ఈ నెల 6న ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహం మాయం స్థానికంగా సంచలనంగా మారింది. ఈ సంఘటనను నిరసిస్తూ గురువారం తెదేపా శ్రేణులు శివాపురంలో, చింతలపూడి బోసుబొమ్మ కూడలిలో ఆందోళన చేపట్టారు. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై చింతలపూడి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శివాపురం గ్రామానికి చెందిన గవర చిన్నారావు, వెంకటేశ్వరరావు, నవీన్‌, శేఖర్‌ కలిసి ఎన్టీఆర్‌ విగ్రహాన్ని మాయం చేసినట్లు అనుమానం ఉందని తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు గుత్తా వెంకటేశ్వరరావు తదితరులు పేర్కొన్నారు. విగ్రహం ఏర్పాటు చేసే సమయంలోనే 24 గంటల్లో మాయం చేస్తామని వారు శపథం చేసినట్లు పేర్కొన్నారు. తెదేపా నాయకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మల్లేశ్వరరావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని