‘నాటు నాటు’కు ఆస్కార్‌ నామినేషన్‌

సినీ ప్రపంచం అత్యున్నత పురస్కారంగా పరిగణించే ఆస్కార్‌ కల సాకారం దిశగా తెలుగు సినిమా మరో అడుగేసింది. ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని నాటు నాటు... పాట 95వ ఆస్కార్‌ నామినేషన్‌కు ఎంపికై చరిత్ర సృష్టించింది.

Updated : 25 Jan 2023 05:55 IST

సినీ ప్రపంచం అత్యున్నత పురస్కారంగా పరిగణించే ఆస్కార్‌ కల సాకారం దిశగా తెలుగు సినిమా మరో అడుగేసింది. ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని నాటు నాటు... పాట 95వ ఆస్కార్‌ నామినేషన్‌కు ఎంపికై చరిత్ర సృష్టించింది. ఇప్పటికే విశ్వ వేదికపై ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ సహా పలు పురస్కారాల్ని గెలుచుకుని ప్రపంచవ్యాప్తంగా ఆకర్షించిన ఈ పాట, తాజాగా ఆస్కార్‌ నామినేషన్లలో బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో నామినేట్‌ అయ్యింది. మరొక్క అడుగు ముందుకు పడిందంటే ఆస్కార్‌ సొంతమైనట్టే.

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ విభాగంలో భారతీయ చిత్రం ‘ఆల్‌ దట్‌ బ్రెత్స్‌’, ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ విభాగంలో.. భారతీయ డాక్యుమెంటరీ లఘుచిత్రం ‘ది ఎలిఫెంట్‌ విస్ఫరర్స్‌’ సైతం నామినేషన్లు దక్కించుకున్నాయి.

నాటు నాటు... ఆస్కార్‌ పట్టు

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని