ముఖ్యమంత్రి హైదరాబాద్‌ పర్యటన రద్దు

గుంటూరు జిల్లా పొన్నూరు, హైదరాబాద్‌లో కార్యక్రమాలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం హాజరవడం లేదు.

Updated : 27 Jan 2023 05:57 IST

దిల్లీకి వెళ్లొచ్చనే ప్రచారం

ఈనాడు, అమరావతి: గుంటూరు జిల్లా పొన్నూరు, హైదరాబాద్‌లో కార్యక్రమాలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం హాజరవడం లేదు. వీటిని రద్దు చేసుకున్నట్లు ఆయన కార్యాలయం గురువారం రాత్రి వెల్లడించింది. దిల్లీ పెద్దల అపాయింట్‌మెంట్‌ దొరికితే అక్కడికి వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలోనే.. ఆయన ఈ కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. శుక్రవారం ఉదయం ఆరోగ్యశాఖపై సమీక్ష, మధ్యాహ్నం సాధారణ అపాయింట్‌మెంట్లను ఖరారు చేశారు. అయితే ఈ నెలాఖరులోపు సీఎం దిల్లీ పర్యటన ఉంటుందని వైకాపా వర్గాలు చెబుతున్నాయి. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ నిమిత్తం కడప ఎంపీ అవినాశ్‌రెడ్డికి సీబీఐ నోటీసు జారీ చేసిన నేపథ్యంలో సీఎం దిల్లీ పర్యటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు