భార్య మృతదేహాన్ని భుజాన మోసుకుంటూ.. నాలుగు కిలోమీటర్లు నడిచిన అభాగ్యుడు
ఒడిశాలోని కొరాపుట్ జిల్లా పొట్టంగి బ్లాక్ సొరడ గ్రామానికి చెందిన ఈడె గురు (30) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
స్పందించి.. అంబులెన్సులో పంపిన పోలీసులు
విజయనగరం రింగురోడ్డు, గంట్యాడ గ్రామీణం, న్యూస్‌టుడే: ఒడిశాలోని కొరాపుట్ జిల్లా పొట్టంగి బ్లాక్ సొరడ గ్రామానికి చెందిన ఈడె గురు (30) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె భర్త సాములు వారం క్రితం భార్యను విశాఖ జిల్లా తగరపువలసలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడం.. చేతిలో డబ్బులు లేకపోవడంతో బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి చేశారు. సాలూరు వెళ్లి, అక్కడి నుంచి సొంతూరుకు మరో వాహనంలో వెళ్దామని ఆటో మాట్లాడుకున్నారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రామవరం వంతెన వద్దకు చేరుకోగానే గురు మృతిచెందారు. ఆటోచోదకుడు మృతదేహాన్ని అక్కడే దింపేసి వెళ్లిపోయాడు. ఏం చేయాలో తెలియక భార్య మృతదేహాన్ని సాములు భుజాన వేసుకొని బయలుదేరాడు. దారిలో ఎదురైనవారిని సాలూరు ఎటువైపని అడిగాడు. అతనికి తెలుగు రాకపోవడంతో అడిగేది ఎవరికీ అర్థం కాలేదు. తిరిగి నాలుగు కిలోమీటర్లు వెనక్కి వెళ్లాడు. అటువైపు వెళ్లేవారు గమనించి గంట్యాడ పోలీసులకు తెలిపారు. సీఐ టి.వి.తిరుపతిరావు, గంట్యాడ ఎస్సై కిరణ్‌కుమార్ రామవరం వద్దకు చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. ఆయనకు భోజనం పెట్టించారు. ప్రైవేటు అంబులెన్సు మాట్లాడి 125 కిలోమీటర్ల దూరంలోని స్వగ్రామానికి పంపించారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని పాచిపెంట సీఐ, ఎస్సైలకు సమాచారమిచ్చారు. బాధితుడి బంధువులకు తెలియజేయాలని, అవసరమైన సహకారం అందించాలని కోరారు. పోలీసుల మానవత్వాన్ని పలువురు హర్షించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Hyderabad: సిగ్నల్ ఫ్రీగా ఎల్బీనగర్.. కూడలికి శ్రీకాంతాచారి పేరు : కేటీఆర్
-
Crime News
Hyderabad: విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య
-
General News
Rahul Gandhi: ‘సేవ్ రాహుల్ గాంధీ, సేవ్ డెమోక్రసీ’.. ఓయూలో నిరసన ర్యాలీ
-
India News
Sukesh- Jacqueline: ‘నా బుట్టబొమ్మ జాక్వెలిన్‌కు’.. జైలు నుంచి సుకేశ్ మరో ప్రేమ లేఖ
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sports News
PAK vs AFG: చరిత్ర సృష్టించిన అఫ్గానిస్థాన్.. పాకిస్థాన్‌పై తొలి విజయం